: యువతకు ఆ విషయం చెప్పేందుకే ఈ చిత్రం తీశాము: ధోనీ
సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి గల ప్రాముఖ్యాన్ని యువతకు తెలియజేసేందుకే ‘ఎమ్ఎస్ ధోనీ: ది అన్ టోల్డ్ స్టోరీ’ చిత్రాన్ని తెరకెక్కించామని టీమిండియా స్టార్ క్రికెటర్ ధోనీ అన్నారు. ఈ చిత్రానికి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని, నేటి యువత ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఈ చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ధోనీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా తెలిపారు.