: చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న రాహుల్.. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వివరించిన వైద్యులు
గత నెల 22 నుంచి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు అక్కడకు చేరుకున్నారు. కొద్ది సేపటి క్రితం చెన్నై అపోలో ఆసుపత్రికి చేరుకున్న రాహుల్ గాంధీని అపోలో ఛైర్మన్ ప్రతాప్‌రెడ్డితో పాటు, తమిళనాడు రాష్ట్ర మంత్రులు ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. వైద్యులతో మాట్లాడుతోన్న రాహుల్ గాంధీ... జయలలిత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు ఆసుపత్రి ఆవరణలో జయలలిత అభిమానుల పూజలు కొనసాగుతున్నాయి. అమ్మ త్వరగా కోలుకోవాలంటూ వారు సర్వమత ప్రార్థనలు చేస్తున్నారు.