: భారత్ కు నిరాశ... పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించలేమన్న అమెరికా


పాకిస్థాన్ ను టెర్రరిస్ట్ దేశంగా ప్రకటించలేమని అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. దీంతో, అంతర్జాతీయ సమాజంలో పాక్ పై ఉగ్రవాద ముద్ర వేయాలని యత్నించిన భారత్ కు తీవ్ర నిరాశ మిగిలింది. భారత్, పాకిస్థాన్ లు సమస్యల పరిష్కారం దిశగా అర్థవంతమైన చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పింది. భారత్ కు సమస్యాత్మకంగా మారిన ఉగ్రవాద తండాల ఏరివేత కోసం తాము ఇరు దేశాల ప్రభుత్వాలతో కలసి పని చేస్తామని తెలిపింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి కిర్బీ మాట్లాడుతూ, అణ్వాయుధాలు టెర్రరిస్టులకు దొరకకుండా పాకిస్థాన్ అన్ని చర్యలు తీసుకుందని భావిస్తున్నట్టు తెలిపారు. అణ్వాయుధాల భద్రత విషయంలో పాక్ జాగ్రత్తగా ఉందనే ఆశాభావం వ్యక్తం చేశారు. కశ్మీర్ అంశంలో తమ వైఖరి మారలేదని... ఆ సమస్యను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పారు.

  • Loading...

More Telugu News