: హైదరాబాద్ లోని మియాపూర్ 'లేక్ వ్యూ ఎన్ క్లేవ్'లో చోరీ


హైదరాబాదులోని మియాపూర్ లో నిన్న రాత్రి చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న లేక్ వ్యూ ఎన్ క్లేవ్ లో ఈ ఘటన జరిగింది. రాత్రి ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన దొంగలు 70 తులాల బంగారం, 3 కేజీల వెండిని దోచుకెళ్లారు. ఇంట్లో నివసించే ప్రభావతి ఇంటికి తాళం వేసి... సమీపంలో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లింది. ఇదే సమయంలో దొంగతనం జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన ప్రభావతి ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి, హడావుడిగా ఇంట్లోకి వెళ్లింది. చోరీ జరిగిందనే విషయం అర్థమయింది. దీంతో, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పరిచయస్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్ సందర్శించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News