: కాస్త సాయం చేయాలని కోరిన అమితాబ్!


సాయం చేయాలంటూ ఇండియన్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన అభిమానులను కోరారు. అమితాబ్ ఏంటి... సాయం కావాలని కోరడం ఏంటని అనుకుంటున్నారా? నిజమే... ఎంత సూపర్ స్టార్ అయినా ఆయనకూ కొన్ని సమస్యలు ఉంటాయి మరి. ఇంతకీ ఆయన సమస్య ఏమిటంటే... మొబైల్ లో కాని, ల్యాప్ టాప్ లో కానీ ఫేస్ బుక్, ట్విట్టర్ వాడేటప్పుడు ఎమోజీలు ఎలా పెట్టాలనేదే ఆయన సమస్య! ఐఫోన్, ఆండ్రాయిడ్ లలో ఎమోజీలు ఎలా పెట్టాలో చెప్పి, కొంచెం సాయం చేయండని ఆయనే ట్విట్టర్ ద్వారా కోరారు. ఆయనకు ట్వీట్ చేయడం ద్వారా... ఆయన సమస్యను మనలో ఎవరైనా పరిష్కరించవచ్చు. 70 ఏళ్లు దాటినప్పటికీ సోషల్ మీడియాలో అమితాబ్ బచ్చన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. పలు సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. అంతేకాదు, తన అప్ డేట్స్ అన్నీ పోస్ట్ చేస్తుంటారు. ట్విట్టర్ లో ఆయనకు దాదాపు 2.30 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఈ క్రమంలోనే, ఎమోజీలు ఎలా పెట్టాలో చెప్పి, కొద్దిగా హెల్ప్ చేయండని ఆయన కోరారు. Amitabh Bachchan ‏@SrBachchan T 2401 - HELP needed ! How do you put emoji's on Twitter and FB from laptop and mobile .. both Android and iPhone

  • Loading...

More Telugu News