: హైదరాబాద్‌లో రోడ్లపై తాగుబోతుల వీరంగం.. పాదచారులను బైక్‌తో ఢీకొట్టుకుంటూ వెళ్లిన మందుబాబులు
హైదరాబాద్ రోడ్లపై తాగుబోతులు వీరంగం సృష్టించారు. పీకల దాకా తాగి ఆపై బైక్‌పై వెళ్తూ భయాందోళనలు సృష్టించారు. ఎల్బీనగర్ దగ్గర పాదచారులను ఢీకొట్టుకుంటూ వెళ్లారు. తాగుబోతుల బైక్ ఢీకొని సోమయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన సోమయ్యను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.