: గుట్టుచప్పుడు కాకుండా ‘బావర్చి’లో జూదం .. హోటల్ సీజ్!


రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లోని ‘బావర్చి’ హోటల్ లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న వ్యవహారం బయటపడింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగి 16 మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2.37 లక్షల నగదుతో పాటు 17 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారిన ‘బావర్చి’ హోటల్ ను సీజ్ చేయాలని రెవెన్యూ అధికారులకు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News