: 'సైన్యానికి వందనాలు'.. సర్జికల్ స్ట్రయిక్స్‌పై యూపీలో మరో పోస్టర్
ఎన్నో ఏళ్లుగా సహనాన్ని పాటిస్తూ వస్తోన్న భారత సైన్యం ఇటీవల పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసి, ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. అయితే, భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రయిక్స్‌పై బీజేపీకి చెందిన నేతలు వ్యాఖ్యలు చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించిన సంగతి తెలిసిందే. సర్జికల్ దాడులను రాజకీయ ప్రయోజనాల దృష్ట్యానే ఎన్డీఏ ఉపయోగించుకుంటుందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు మరో పోస్టర్లు వెలిశాయి. లక్నోలోని బీజేపీ ఆఫీసు ఎదుట 'సైన్యానికి వందనాలు' అంటూ ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. అందులో నరేంద్ర మోదీ, పారికర్ ఫొటోలు ఉన్నాయి. వారి ఫొటోల మధ్య సైనికులు తుపాకులు పట్టుకొని పోరాడుతున్నట్లు పోస్టరులో ఉంది. నిన్న వారణాసిలో కూడా మోదీని రాముడిగా, పాక్ ప్రధాని నవాజ్‌ను పదితలల రావణుడిగా, కేజ్రీవాల్ ను రావణుడి కుమారుడు మేఘనాథుడిగా చిత్రీకరిస్తూ శివసేన కూడా ఓ పోస్టర్‌ను పెట్టింది. యూపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటువంటి పోస్టర్లు ప్రయోగించడం మరోసారి బీజేపీపై ప్రతిపక్షాలు విమర్శలు సంధించేందుకు అవకాశం ఇస్తున్నాయి.