: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతం గుండా పయనించి, ఉత్తర కోస్తాంధ్ర తీరం మీదుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వాటి ప్రభావంతోనే తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు.