: నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న గంభీర్
భారత్‌లో న‌్యూజిలాండ్ క్రికెట్ టీమ్ పర్యటనలో భాగంగా జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా ఇప్పటికే నెగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా ముందున్న లక్ష్యం సిరీస్‌ను క్లీన్‌స్విప్ చేయడం. అందులో భాగంగా టీమిండియా ఆటగాళ్లు ఇండోర్ లోని స్టేడియంలో సాధన చేస్తున్నారు. ఎల్లుండి నుంచే మూడో టెస్టు మ్యాచు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ప్రారంభం కానుండడంతో టీమిండియా ఈరోజు ప్రాక్టీస్ ప్రారంభించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ గాయంతో సిరీస్‌కు దూరమయిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ క్రీజులో అడుగుపెట్టనున్నాడు. చాలా కాలం తరువాత అంతర్జాతీయ మ్యాచులో ఆడుతున్న గంభీర్ నెట్స్‌లో సీరియస్‌గా ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తోన్న టీమిండియా ఆటగాళ్లను చూడడానికి అభిమానులు స్టేడియానికి భారీగా తరలివచ్చారు. మూడో టెస్టు మ్యాచు అనంతరం న్యూజిలాండ్ తో టీమిండియా ఐదు వన్డే మ్యాచులు ఆడనుంది.