: ఇరోమ్ షర్మిలను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు.. త్వరలో రాజకీయ పార్టీ పెట్టనున్న మణిపూర్ ఉక్కు మహిళ
సైనికుల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లు నిరాహార దీక్ష కొనసాగించి, మణిపూర్ ఉక్కు మహిళగా పేరుపొందిన ఇరోమ్ షర్మిలపై పెట్టిన ఆత్మహత్యాయత్నం కేసులో మణిపూర్ జిల్లా న్యాయస్థానం ఆమెను నిర్దోషిగా ప్రకటించింది. ఇరోమ్ షర్మిల రెండు నెలల క్రితం తన దీక్షను విరమించిన విషయం విదితమే. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆమె ఇక, రాజకీయ పార్టీ పెడతానని ప్రకటించారు. వచ్చే ఏడాది మణిపూర్‌లో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతానని ఆమె దీక్ష విరమించిన సందర్భంగా మీడియాకు చెప్పిన విషయం తెలిసిందే. తాను పదవి చేపట్టాక మణిపూర్ ప్రజల మద్దతుతో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించేలా చేస్తానని చెప్పారు. ఈ నెలలోనే రాజకీయపార్టీ ఏర్పాటు చేస్తానని ఆమె చెప్పారు.