: తదుపరి ఎన్నికల్లోనూ అధికారం పొందడమే లక్ష్యంగా టీఆర్ఎస్ దుర్బుద్ధితో పనిచేస్తోంది: ఎల్.రమణ
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై టీటీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ రోజు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పాలన వల్ల తెలంగాణ అభివృద్ధి చెందలేకపోతోందని ఆయన అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు విధానం పట్ల కరీంనగర్ జిల్లా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాల విభజన అంశంలో స్పష్టత లేదని ఆయన అన్నారు. ఒక పద్ధతి, విధానం లేకుండా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళుతోందని ఆరోపించారు. కేసీఆర్ సర్కారు దుర్బుద్ధితో, తదుపరి ఎన్నికల్లో మళ్లీ అధికారం పొందడమే లక్ష్యంగా పనిచేస్తోందని అన్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి నష్టం కలుగుతుందని అన్నారు.