: ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సున్నం రాజయ్య.. భద్రాచలాన్ని జిల్లా చేయాలని డిమాండ్
ఓవైపు తెలంగాణ ప్రభుత్వం దసరా నుంచి కొత్త జిల్లాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా తమ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆయా ప్రాంతాల నాయకులు, ప్రజలు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని భద్రాచలంను జిల్లాగా ప్రకటించాలని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అంతేగాక, వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాల్‌పల్లి జిల్లాలో కలపడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన నాలుగు పంచాయతీలను కూడా మళ్లీ భద్రాచలంలో కలపాలని ఆయన కోరుతున్నారు. తన డిమాండును సాధించేవరకు దీక్ష కొనసాగుతుందని అన్నారు.