: హంద్వారా ఉగ్ర‌దాడి పాక్ ప‌నే.. స్వాధీనం చేసుకున్న‌ మందులు, ఇంజెక్షన్లపై ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ ముద్ర


హంద్వారాలోని లాన్ గేట్ 30 రాష్ట్రీయ రైఫిల్స్ శిబిరంపై దాడికి దిగిన ఉగ్ర‌వాదుల‌ను భార‌త సైన్యం విజ‌య‌వంతంగా తిప్పికొట్టింది. లాంగ్ గేట్ వద్ద ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను హ‌త‌మార్చారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డి ఆర్మీ అధికారులు మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి ప‌లు అంశాల‌ను తెలిపారు. ఉగ్ర‌వాదుల నుంచి ఆయుధాలతో పాటు ప‌లు వ‌స్తువులు స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. అందులో మందుగుండు సామగ్రి, మూడు ఏకే 47 గ‌న్‌లు, ప‌లు మందులు, ఇంజెక్షన్స్, మ్యాపులు ఉన్నట్లు పేర్కొన్నారు. మందులు, ఇంజెక్షన్లపై ‘మేడ్ ఇన్ పాకిస్థాన్’ అన్న ముద్ర స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

  • Loading...

More Telugu News