: మద్యం మత్తులో హైదరాబాదు రోడ్లను బెంబేలెత్తించిన కాలేజీ విద్యార్థులు
హైదరాబాదులోని ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు మద్యం మత్తులో హల్‌చల్ చేసి వాహనదారులను బెంబేలెత్తించారు. వివరాల్లోకి వెళ్తే... ఎయిర్ ఫిల్ ఇంటర్నేషనల్ కాలేజీలో ఫేర్ వెల్ డే జరిగింది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు పార్టీలో ఫుల్లుగా మద్యం తాగారు. అనంతరం ద్విచక్రవాహనాలు తీసుకుని రోడ్డుపై హంగామా చేశారు. ఇష్టానుసారం వెళ్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. అంతటితో ఆగని విద్యార్థులు తమకు అడ్డం వచ్చాడని ఓ యాచకుడిని చితకబాదారు. ఆ దాడిని ఆపబోయిన స్థానికులపై కూడా దాడికి దిగారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగప్రవేశం చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.