: ఆర్టీసీ బస్సులోనే ఉరేసుకున్న కండక్టర్
కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ బస్సులోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తోటి సిబ్బందిని కంటతడి పెట్టించింది. కర్ణాటకలోని బీదర్-చుంచోళి మార్గంలో సర్వీసు చేస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సుకి డ్రైవర్ కం కండక్టర్ గా ఈరణ్ణ మీనకేర (35) విధులు నిర్వహిస్తున్నాడు. గత రాత్రి 9.30 గంటలకు తనిఖీలు నిర్వహించేందుకు ఇన్ స్పెక్షన్ సిబ్బంది బస్సు ఎక్కారు. తనిఖీలు నిర్వహించగా, ఇద్దరు ప్రయాణీకులకు టికెట్లు లేకపోవడం గుర్తించారు. దీంతో మీనకేరపై కేసు నమోదు చేసి, ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెందిన ఆయన బస్సులోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.