: తెలంగాణలో కొత్త జిల్లాలను ప్రారంభించేది వీరే!
తెలంగాణలో ఏర్పాటు కానున్న కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు దసరా రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ జిల్లాలను ఆయా నేతలు, ఉన్నతాధికారులు ప్రారంభించనున్నారు. ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారనే అంశాన్ని ఈ రోజు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఆ వివరాలు .. మెదక్, సిద్దిపేట- ముఖ్యమంత్రి కేసీఆర్, భూపాలపల్లి - స్పీకర్ మధుసూదనాచారి, జనగామ - మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, జగిత్యాల - డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, వరంగల్ రూరల్ - డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, సిరిసిల్ల - ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, మల్కాజ్‌గిరి (మేడ్చల్) - సీఎస్ రాజీవ్ శర్మ, యాదాద్రి - హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, పెద్దపల్లి - ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మంచిర్యాల - క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, కామారెడ్డి - వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆసిఫాబాద్ - అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, వికారాబాద్ - రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, సూర్యాపేట - విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, వనపర్తి - పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, కొత్తగూడెం - రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నిర్మల్ - దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గద్వాల - పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, నాగర్ కర్నూల్ - వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, మహబూబాబాద్- పర్యాటక శాఖ మంత్రి చందూలాల్ ప్రారంభించనున్నారు.