: పాక్ కు దిమ్మ తిరిగే షాక్.. పీవోకేలో సర్జికల్ స్ట్రయిక్స్ ను ధ్రువీకరించిన మీర్పూర్ ఎస్పీ


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లో సర్జికల్ స్ట్రయిక్స్ జరగలేదంటూ వాదిస్తున్న పాకిస్థాన్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ దాడులు జరిగాయంటూ పీఓకే లోని మీర్పూర్ ఎస్పీ గులాం అక్బర్ ధ్రువీకరించారు. సెప్టెంబర్ 29న సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయంటూ బలమైన ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మేరకు ఆయన చెప్పిన విషయాలు ఆడియో రికార్డు ద్వారా లభ్యమయ్యాయి. కాగా, తాజాగా చేసిన ఈ ప్రకటనతో అటు పాకిస్థాన్ నేతలకు, ఇటు మన దేశంలోని ప్రతిపక్ష రాజకీయపార్టీల నేతలకు సరైన సమాధానం చెప్పినట్లయింది. ఎందుకంటే, ఈ దాడులు జరగలేదంటూ వారు చేస్తున్న వాదనలకు ఈ ప్రకటన ద్వారా ఇకపై తాళం పడనుంది.

  • Loading...

More Telugu News