: పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు.. ఒక్కో ఉగ్ర శిబిరానికి రక్షణగా దాదాపు 40 మంది పాక్ ఆర్మీ: మోదీకి చెప్పిన అజిత్ ధోవల్
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో దర్జాగా శిబిరాలు ఏర్పాటు చేసుకొని ఉన్న ఉగ్ర శిబిరాలపై ఇటీవలే భారత సైన్యం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే పీవోకేలో మరో 12 ఉగ్ర శిబిరాలు వెలిశాయి. ఈ విషయాన్ని భారత నిఘా వర్గాలు చెప్పాయి. పాకిస్థాన్ ఆర్మీ ఆ ఉగ్రశిబిరాలకు రక్షణ కల్పిస్తున్నట్లు సమాచారం. ఈరోజు ఉదయం కేంద్రమంత్రి వర్గ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ఈ విషయం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పినట్లు తెలుస్తోంది. అందులో ఒక్కో ఉగ్ర శిబిరానికి దాదాపు 40 నుంచి 50 మంది పాక్ జవాన్లు రక్షణగా ఉన్నట్లు ఆయన ప్రధానికి వివరించారు.