: మీ స్థాయిలో తప్పులు సరిదిద్దకపోతే, నా స్థాయిలో జోక్యం ఉంటుంది: ఇసుక అక్రమాలపై చంద్రబాబు ఆగ్రహం
ఇసుక అక్రమాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా తాను ఉపేక్షించనంటూ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ రెండో రోజు శిక్షణా తరగతుల్లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజలకు మంచి చేయాలని ఉచిత ఇసుక పథకం ప్రవేశపెట్టామని, ఈ పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఒక పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా క్షేత్ర స్థాయి నివేదికలు తెప్పించుకుంటామని అన్నారు. ‘కింది స్థాయి నేతలు తప్పు చేస్తే.. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలదే బాధ్యత. ఒకవేళ మీ స్థాయిలో తప్పులు సరిదిద్దకపోతే, నా స్థాయిలో జోక్యం ఉంటుంది’ అంటూ చంద్రబాబు మండిపడ్డారు.