: సర్జికల్ స్ట్రయిక్స్ పై అనుమానం ఉన్నవారు పాక్ పౌరసత్వం తీసుకోవచ్చు: కేంద్ర మంత్రి ఉమాభారతి
ఎల్ఓసీ దాటి వెళ్లి భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ నకిలీవంటూ వ్యాఖ్యలు చేస్తున్న రాజకీయ పార్టీల నేతలకు బీజేపీ ఫైర్ బ్రాండ్, కేంద్ర మంత్రి ఉమాభారతి తన దైన శైలిలో సమాధానమిచ్చారు. ‘సర్జికల్ స్ట్రయిక్స్ పై అపనమ్మకం, అనుమానం ఉన్న వారు పాకిస్థాన్ దేశ పౌరసత్వం తీసుకోవచ్చు. సైన్యం సామర్థ్యాన్ని చులకన చేసి మాట్లాడొద్దు’ అని ఆమె అన్నారు. కాగా, సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన ఆధారాలు విడుదల చేయాలంటూ వస్తున్న డిమాండ్లపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజ్ కూడా స్పందించారు. ప్రభుత్వం, సైనిక దళాలపై ప్రతిఒక్కరూ నమ్మకం ఉంచాలని, సైన్యం బాధ్యతలను నిర్వహించేందుకు సహకరించాలని కోరారు.