: తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ వేడుకలు.. ఆటపాటలతో ఎంపీ కవిత సందడి
హైదరాబాద్ లోని తెలంగాణ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో పాల్గొన్న మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా గడుపుతున్నారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత బతుకమ్మ పాటలు పాడుతూ, ఇతర మహిళల చేత పాడిస్తూ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కోడలు శైలిమతో పాటు ఆయన బంధువులు కూడా పాల్గొన్నారు. మహిళల ఆటపాటలతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది.