: 'ఓ దేవుడు గారూ...' అంటూ సెహ్వాగ్ విన్నపం... తథాస్తు చెప్పిన సచిన్!
మైదానంలో ఆటకు వీడ్కోలు చెప్పి, ప్రస్తుతం ఒకవైపు వ్యాఖ్యాతగా రాణిస్తూ, మరోవైపు సరదాగా ట్వీట్లు పెడుతూ వార్తల్లో నిలుస్తున్న మాజీ డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ చేసిన కామెంట్ కు సచిన్ స్పందించాడు. న్యూజిలాండ్ పై జరిగిన రెండో టెస్టులో నెగ్గిన టీమ్ ఇండియా నంబర్ వన్ పొజిషన్ ను చేరుకోగా, జట్టును అభినందిస్తూ సచిన్ ట్వీట్ చేశాడు. సమకాలీన క్రికెట్ లో అందరూ దేవుడిగా భావించే సచిన్ కామెంట్ పై సెహ్వాగ్ స్పందిస్తూ, "ఓ దేవుడు గారూ, కాస్త కామెంటేటర్లను కూడా ప్రోత్సహించండి. మాకూ స్ఫూర్తి కలుగుతుంది" అన్నాడు. దీన్ని చూసిన సచిన్ తనదైన శైలిలో "విజయోస్తు... తథాస్తు" అని దీవించేశాడు. వీరిద్దరి ట్వీట్లు, రీట్వీట్లను అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.