: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
మెదక్ జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న కారును లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.