: సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నేను పాల్గొంటా: సీఎం కేసీఆర్
దసరా పండగ రోజు నుంచే కొత్త జిల్లాల్లో పాలనా కార్యక్రమాలు ప్రారంభించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త జిల్లాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, మంత్రులు, స్పీకర్, మండలి చైర్మన్, సీఎస్ ఒక్కో జిల్లాను, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెవెన్యూ డివిజన్లు, మండలాలను ప్రారంభించాలని ఆయన సూచించారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో పని ప్రారంభించాలని, ఎవరు ఏ కార్యాలయం ప్రారంభించాలో జాబితా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు.