: టీవీ 'ద్రౌపది' రూపా గంగూలీని రాజ్యసభకు నామినేట్ చేసిన బీజేపీ


1990 దశకంలో దూరదర్శన్ లో సూపర్ హిట్టయిన మహాభారతం సీరియల్ లో ద్రౌపది పాత్ర పోషించి, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ సుపరిచితమైన రూపా గంగూలీని రాజ్యసభకు నామినేట్ చేశారు. గత సంవత్సరం బీజేపీలో చేరిన రూపా గంగూలీ, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా ఉత్తర నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కోల్ కతా లోని కల్యాణి ప్రాంతంలో జన్మించిన ఆమె, మహాభారతం సీరియల్ తరువాత పలు బెంగాలీ, హిందీ, కన్నడ, అసోం, ఒరియా చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు.

  • Loading...

More Telugu News