: 'పాక్ ఉగ్రదేశం' పిటిషన్ ను మూసేసిన వైట్ హౌస్


ఉగ్రవాదులకు పాక్ పెట్టుబడులు అందిస్తోందని, ఆ దేశాన్ని ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్లో ఇండో - అమెరికన్లు దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. లక్ష సంతకాలు వస్తే, దాన్ని అధ్యక్షుడు తప్పనిసరిగా పరిశీలించి, తన నిర్ణయాన్ని తెలపాల్సి వుండగా, ఈ పిటిషన్ పై ఇప్పటికే 6.25 లక్షలకు పైగా సంతకాలు వచ్చాయి. కొన్ని సంతకాల్లో టెక్నికల్ ఫాల్ట్ లు ఉన్నాయన్న కారణాన్ని చూపుతూ దీన్ని మూసేసినట్టు 'వుయ్ ది పీపుల్' వెబ్ సైట్ పేర్కొంది. ఇక అనుమానాస్పద సంతకాలు తొలగించి, పిటిషన్ ను పరిశీలనకు స్వీకరిస్తారా? లేదా? అన్న విషయమై వైట్ హౌస్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇదిలావుండగా, పాక్ - అమెరికన్లు దాఖలు చేసిన భారత వ్యతిరేక పిటిషన్ పై 66 వేలకు పైగా సంతకాలు వచ్చాయి.

  • Loading...

More Telugu News