: మహిళ తన కోరిక తీర్చడం లేదని ఆమె కొడుకుని కిడ్నాప్ చేసిన యువకుడు... వలపన్ని పట్టిన పోలీసులు


తన లైంగిక వాంఛలను తీర్చడం లేదన్న కోపంతో ఓ గృహిణి కుమారుడిని అదే గ్రామానికి చెందిన వ్యక్తి కిడ్నాప్ చేయగా, పోలీసులు వలపన్ని పట్టుకున్న ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ముసునూరులో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న గొల్లపల్లి సుబ్బారావు (25) అనే వ్యక్తి కన్ను అదే గ్రామంలోని మద్దాల సునీత (32) పై పడింది. గత కొంత కాలంగా ఆమె వెంటపడుతూ కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో సునీత తొమ్మిదేళ్ల కుమారుడు సాగర్, కిరాణా దుకాణానికి వెళ్లిన వేళ, ఆటో ఎక్కించుకుని నూజివీడు తీసుకెళ్లి ఓ హోటల్ లో బంధించాడు. ఆపై సునీతకు ఫోన్ చేసి తక్షణం రాకుంటే, సాగర్ ను చంపేస్తానని బెదిరించాడు. ఆందోళనకు గురైన ఆమె విషయాన్ని భర్తకు చెప్పగా, బంధువుల సహకారంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పక్కాగా ప్లాన్ వేసి, ఆమెతో సుబ్బారావుకు ఫోన్ చేయించి, తాను హోటల్ కు వస్తున్నట్టు చెప్పించారు. ఆపై హోటల్ వద్దకు వెళ్లి, సుబ్బారావును అరెస్ట్ చేసి బాలుడిని రక్షించారు. నిందితుడిపై కిడ్నాప్, హత్యాయత్నం, లైంగిక వేధింపుల కేసులను పెట్టినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News