: లోకేష్ ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి నిలబడతాను: రేవంత్ ప్రశ్నకు చంద్రబాబు సమాధానం


హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు పాత ఇంటిని కూలగొట్టి కొత్తగా ఇల్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కొత్త ఇంటి నిర్మాణం కూడా పూర్తయింది. అయినా, చంద్రబాబు కుటుంబం పార్క్ హయత్ హోటల్ లోని టాప్ ఫ్లోర్ లో ఉన్న లగ్జరీ సూట్ లోనే ఇప్పటికీ ఉంటోంది. ఇక నిన్న తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశమైన వేళ, ఇంటి నిర్మాణం పూర్తయిన విషయాన్ని ప్రస్తావించిన రేవంత్ రెడ్డి, "గృహ ప్రవేశం ఎప్పుడు సార్?" అని ప్రశ్నించారు. దీనికి స్పందించిన చంద్రబాబు, "నాదేముంది? అంతా లోకేష్ ఇష్టం. లోకేష్ చెప్పినప్పుడు వచ్చి నిలబడటమే నా పని. అంతకన్నా నేను చేసేదేముంది?" అంటూ నవ్వుతూ సమాధానం చెప్పారట.

  • Loading...

More Telugu News