: పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్.. నేడు అనంతలో జగన్ మహాధర్నా
వర్షాభావంతో రాష్ట్రవ్యాప్తంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నేడు అనంతపురంలో మహాధర్నా చేబడుతోంది. అనంతపురం కలెక్టరేట్ ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో జరిగే ఈ ధర్నా కార్యక్రమంలో వై.ఎస్.జగన్ పాల్గొననున్నట్టు ఆ పార్టీ నేతలు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేసినట్టు పేర్కొన్నారు. వర్షాభావంతో అనంతపురంతోపాటు రాయలసీమలో వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని భావించిన జగన్ అనంత కేంద్రంగా మహాధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు జిల్లా నాయకులు తెలిపారు.