: ఐఎస్ఐఎస్ చీఫ్ పై విషప్రయోగం...తీవ్ర అనారోగ్యం
ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూబకర్-బగ్దాదీపై విషప్రయోగం జరిగింది. లాడెన్ అంతమైన తరువాత, ఒక్కసారిగా విరుచుకుపడి నిరాయుధులపై దాడులు చేయడం, బందీలను అత్యంత కిరాతకంగా హతమార్చుతూ ఐఎస్ఐఎస్ క్రేజ్ తెచ్చుకుంది. ప్రపంచానికి కంటకంగా మారిన దీని అధిపతి అబూ బకర్ అల్-బాగ్దాదీని హత్య చేసేందుకు అతని ఆహారంలో విషం కలిపారు. విషాహారం తిన్న ఐసీస్ కీలక నేతలు నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై స్పందించిన ఉగ్రవాదులు హుటాహుటీన వారిని రహస్య ప్రాంతానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పరిసరాల్లో సోదాలు చేసిన ఉగ్రవాదులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 2011లో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్-బాగ్దాదీ తలకు అమెరికా వెలకట్టింది. బగ్దాదీని సజీవంగా పట్టుకున్నా లేదా చంపేందుకు సహకరించిన వారికి పది మిలియన్ డాలర్ల బహుమతిగా ఇస్తామని ప్రకటించింది. గతంలో పలు సందర్భాల్లో బాగ్దాదీ గాయపడినట్లు, మృతి చెందినట్లు వార్తలొచ్చినా అవి అవాస్తవమని తేలిన సంగతి తెలిసిందే.