: స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన చంద్రబాబు
తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని రకరాల ఫల,పుష్పాదులతో ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. పెద్దశేషవాహనం సేవలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఈ సందర్భంగా వేద మంత్రాల మధ్య శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు శ్రీమతి భువనేశ్వరి కూడా ఉన్నారు. బ్రహ్మోత్సవాల్లో పాల్గొని, శ్రీవారి సేవలో తరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తిరుమల చేరుకున్నారు.