: ప్రియాంకా చోప్రాని హాలీవుడ్ నటుడు ప్రేమిస్తున్నాడట... బయటపెట్టిన హాలీవుడ్ నటి!


బాలీవుడ్ లో షాహిద్ కపూర్, హర్మాన్ బవేజాతో గాఢమైన ప్రేమాయణం నడిపిన ప్రియాంకా చోప్రా హాలీవుడ్ నటులను కూడా బాగానే ఆకట్టుకుంటోంది. తాజాగా, అమెరికాలోని ప్రముఖ టీవీ వ్యాఖ్యాత ఎలెన్‌ డిజీనరెస్‌ ముఖాముఖి కార్యక్రమానికి హాలీవుడ్‌ నటి లియ మెచెల్లి హాజరైంది. ఇందులో 'హాలీవుడ్‌ నటుడు టామ్‌ హిడిల్‌ స్టన్‌ తో డేటింగ్‌ చేస్తారా?' అంటూ ఎలెన్‌ ఆమెను ప్రశ్నించింది. దీనికి లియ సమాధానిమిస్తూ, టామ్ హిడిల్ స్టన్ కు చాలా ప్రేమకథలు ఉన్నాయని చెప్పింది. అతనిని తాను అందుకోలేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం టామ్ హిడెల్ స్టన్ లిస్టులో ప్రేయసిగా 'క్వాంటికో' స్టార్ ప్రియాంక చోప్రా ఉందని వెల్లడించింది. ఆమెను టామ్‌ ప్రేమిస్తున్నాడని ప్రకటించింది. ప్రస్తుతం వారిద్దరూ చనువుగా మాట్లాడుకుంటున్నారని కూడా బయటపెట్టింది. అయితే, వీరిద్దరూ అఫైర్ నడుపుతున్నారా? లేక వీరిది నిజమైన ప్రేమేనా? అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

  • Loading...

More Telugu News