: వార్ వన్ సైడ్ అయిపోయింది... ఆరు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్


కోల్‌కత్తాలోని ఈడెన్‌గార్డెన్స్ లో జరుగుతున్న భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో నాలుగోరోజు ఆటలో న్యూజిలాండ్ జట్టు టాప్ ఆర్డ‌ర్‌ బ్యాట్స్‌మెన్‌తో పాటు మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ కూడా విఫ‌ల‌మ‌య్యారు. మైదానంలో బౌలర్ల హవా కొనసాగుతోంది. అద్భుతంగా రాణిస్తోన్న‌ లాథమ్ (74) రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుటైన త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన శాంట్‌న‌ర్.. 9 ప‌రుగుల‌కే మ‌హ‌మ్మ‌ద్ స్యామీ బౌలింగ్‌లో అవుట‌య్యాడు. ఆ త‌రువాత మైదానంలో అడుగుపెట్టిన వాట్లింగ్‌ను కూడా కేవ‌లం ఒక్క పరుగుకే వెనుదిరిగేలా చేశాడు స్యామీ. దీంతో స్యామీ ఖాతాలో రెండో ఇన్సింగ్స్‌లో రెండు వికెట్లు ప‌డ్డాయి. అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు వికెట్లు తీయ‌గా, జ‌డేజా 1 వికెట్ తీశాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఇంకా ఖాతా తెర‌వ‌లేదు. ప్ర‌స్తుతం క్రీజులో రోంచి(32), హెన్రీ 7 ప‌రుగుల‌తో ఉన్నారు. టీమిండియా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. న్యూజిలాండ్ స్కోరు 176 కాగా గెలుపునకు మరో 203 పరుగులు చేయాల్సి ఉంది. న్యూజిలాండ్ కు కావలసినంత సమయం ఉంది.. కానీ నాలుగు వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి.

  • Loading...

More Telugu News