: జయలలిత కోలుకుంటున్నారు: హిందూ మాజీ ఎడిటర్ మాలినీ పార్థసారధి వరుస ట్వీట్స్
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై 'హిందూ' పత్రిక మాజీ ఎడిటర్ మాలినీ పార్థసారధి వరుస ట్వీట్స్ చేశారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని ఆమె స్పష్టం చేశారు. జయలలితను పరామర్శించిన ఓ స్నేహితురాలి నుంచి తాను సమాచారం సంపాదించానని ఆమె తెలిపారు. జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, పుకార్లను నమ్మవద్దని ఆమె చెప్పారు. జయలలిత కోలుకుంటున్నారని, చికిత్సకు ఆమె స్పందిస్తున్నారని, వేగంగా కోలుకుంటున్నారని ఆమె అన్నారు. ఆమె ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు ఆమె ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నానని, ఆమె త్వరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె తెలిపారు.