: రేపు 2 గంటల వరకూ డెడ్ లైన్... కర్ణాటకకు సుప్రీంకోర్టు అల్టిమేట్టం


తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న కావేరీ నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అడుగడుగునా తామిస్తున్న ఆదేశాలను కన్నడ సర్కారు ఉల్లంఘించడంపై మండిపడుతూ, ఇప్పటివరకూ తమిళనాడుకు ఎంత నీరు వదిలారు? అసలు వదిలారా? లేదా అన్న విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటల్లోగా తెలియజేయాలని న్యాయమూర్తి డెడ్ లైన్ విధించారు. తమ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించింది. మరోవైపు కర్ణాటకలో ఈ ఉదయం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కాగా, నవంబర్ వరకూ తమిళనాడుకు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకోకుండా నదిపై ప్రాజెక్టులు నిర్మించుకుంటే, ఇప్పుడు బలిపశువుగా మారినట్లయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న నీరు తాగు అవసరాలకు కూడా సరిపోయే పరిస్థితి లేదని, ఇక దిగువకు నీరెలా ఇవ్వగలమని ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో సుప్రీంకోర్టులో కేసు విచారణ రేపటికి వాయిదా పడింది.

  • Loading...

More Telugu News