: కెనడాలో అరుణ్‌జైట్లీ.. అనంతరం అమెరికాలో పర్యటన!


కెనడాతో భారత్ చేసుకున్న ఆర్థిక ఒప్పందాలు, ఇతర వ్యాపార సంబంధాలపై చర్చించడానికి గానూ ఆ దేశంలో త‌లెపెట్టిన‌ మూడు రోజుల పర్యటన‌లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కొద్ది సేప‌టి క్రితం కెన‌డాకు చేరుకున్నారు. కాంప్రహెన్షివ్‌ ఎకనమిక్‌ పార్ట్‌నర్‌షిప్‌ అగ్రిమెంట్‌(సీఈపీఏ)తో పాటు ఫారిన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అగ్రిమెంట్‌(ఎఫ్‌ఐపీఏ)పై ఆయ‌న ఉన్న‌త‌స్థాయి స‌మీక్షలో పాల్గొంటారు. త‌న పర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న విదేశీ పెట్టుబడిదారులతో కూడా భేటీ కానున్నారు. ఆ దేశంలోని అధికారుల‌తో చ‌ర్చించాక అటు నుంచి జైట్లీ అమెరికా పర్యటనకు బ‌య‌లుదేరుతారు. వాషింగ్టన్‌లో నిర్వ‌హించ‌నున్న మూడు రోజుల ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌ (ఇంటర్నేషనల్‌ మోనిటరీ ఫండ్‌) వార్షిక సమావేశానికి జైట్లీ హాజ‌రుకానున్నారు.

  • Loading...

More Telugu News