: పూంచ్ సెక్టార్ లో మరోసారి పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం
దాడులకు ప్రతీకారంగా భారత్ దీటైన జవాబు ఇస్తోన్నా పాకిస్థాన్ మాత్రం తన బుద్ధిని మార్చుకోవడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు దిగుతోంది. ఈరోజు కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ పరిధిలోని షహర్‌పుర్ లో కొద్దిసేపటి క్రితం మరోసారి కాల్పులకు తెగబడింది. భారత భద్రతా బలగాలు కాల్పులను తిప్పికొడుతున్నాయి. ఈరోజు ఉదయం పంజాబ్‌లోని కోట్నిలో కూడా పాక్ కాల్పులు జరిపింది.