: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, బిగ్ బిలియన్ డేస్, అన్ బాక్స్ దివాలీ... కస్టమర్ల కోసం రూ. 10 వేల కోట్ల విలువైన ఆఫర్ల వెల్లువ!
ఈ దసరా, దీపావళి పండగ సీజన్లో కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా వందల కోట్ల విలువైన వ్యాపార ప్రకటనలను గుప్పిస్తూ, అంతకు మించి వేల కోట్ల రూపాయల విలువైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన అమేజాన్ 'గ్రేట్ ఇండియన్ పెస్టివల్' పేరిట, ఫ్లిప్ కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' పేరిట, స్నాప్ డీల్ 'అన్ బాక్స్ దివాలీ' పేరుతో ఆఫర్లను అందిస్తున్నాయి. అత్యుత్తమ డీల్స్ అందిస్తున్నది తామంటే, తామేనని చెబుతూ కస్టమర్ల నుంచి ఆర్డర్ల కోసం వేచి చూస్తున్నాయి. ఈ కామర్స్ దిగ్గజాలు అందిస్తున్న ఆఫర్లలో ఎంపిక చేసిన కొన్నింటి వివరాలివి... మొబైల్ ఫోన్స్ : * మోటో జీ ప్లస్ 32 జీబీ ని రూ. 13,499కి (ఎంఆర్పీ రూ. 15 వేలు) అమేజాన్ అందిస్తోంది. * శాంసంగ్ గెలాక్సీ ఆన్8 ను ఫ్లిప్ కార్ట్ రూ. 14,990కి (ఎంఆర్పీ రూ. 15,990) అందిస్తోంది. * లీఎకో ఎల్ఈ 2 ను ఫ్లిప్ కార్ట్ రూ. 10,499కి (ఎంఆర్పీ రూ. 11,999) విక్రయిస్తోంది. * యాపిల్ ఐఫోన్ 6 - 16 జీబీ వేరియంట్ ను ఫ్లిప్ కార్ట్ రూ. 29,990కి (ఎంఆర్పీ రూ. 39 వేలు) అందిస్తోంది. టెలివిజన్ లు: * పానాసోనిక్ 40 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్ఈడీ టీవీని స్నాప్ డీల్ రూ. 26,990కి (ఎంఆర్పీ రూ. 47,500) అందిస్తోంది. * వీయూ 32 అంగుళాల హెడ్డీ రెడీ ఎల్ఈడీని రూ. 11,990కి (ఎంఆర్పీ రూ. 16 వేలు) ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. * ఎలక్ట్రానిక్స్ అండ్ ఆడియో విభాగంలో 'మీ' 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ను రూ. 899కు (ఎంఆర్పీ రూ. 1,299) అమేజాన్ విక్రయిస్తోంది. * అమేజాన్ లో రూ. 1000 విలువైన బుక్ మైషో ఓచర్ 800కు, రూ. 100 విలువైన పీవీఆర్ సినిమాస్ ఓచర్ రూ. 50కి లభిస్తోంది. * స్నాప్ డీల్ గిఫ్ట్ కార్డ్ అమ్మకాలపై 5 శాతం రాయితీని అందిస్తోంది. * ఫ్లిప్ కార్ట్ ఫ్యాషన్ సేల్ లో భాగంగా 50 వేల రకాల షూస్ పై 50 శాతం వరకూ రాయితీలను అందిస్తున్నట్టు ప్రకటించింది. * అమేజాన్ లో పీటర్ ఇంగ్లండ్ బ్రాండ్ పై 40 శాతం, యునైటెడ్ కలర్స్ ఆఫ్ బెనిట్టన్ ఉత్పత్తులపై 50 శాతం, లివీస్ బ్రాండ్ ప్రొడక్టులపై 40 శాతం, యారో, పెపే జీన్స్ పై 50 శాతం వరకూ డిస్కౌంటులు లభిస్తున్నాయి. ఇక ఇవే వెబ్ సైట్లలో డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగించి కొనుగోళ్లు జరిపితే 10 శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తుండగా, ఎంపిక చేసుకున్న కార్డుల ద్వారా లావాదేవీలు సాగిస్తే, 15 శాతం నుంచి 20 శాతం వరకూ డిస్కౌంటులు ఇస్తున్నాయి. ఎటొచ్చీ, తక్కువ ధరలకు లభిస్తోంది కదా అని అనవసరమైన ఉత్పత్తుల జోలికి వెళ్లకుండా, అవసరమైన ప్రొడక్టులను మాత్రమే అన్ని వెబ్ సైట్లలో ధరలను చెక్ చేసుకుని కొనుగోలు చేయాలన్నది సలహా.