: హయత్‌నగర్‌లో అమానుష ఘటన.. 3 నెలల ఆడశిశువును చెట్లపొదల్లో వదిలివెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
‘బేటీ బచావో, బేటీ పడావో’ లాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నా, కొడుకు కన్నా కూతురే నయం అని నిరూపిస్తోన్న ఘటనలు ఎన్నో వెలుగులోకొస్తున్నా ఆడపిల్ల పుట్టిందంటేనే గుండెల్లో కుంపటిలా భావిస్తోన్న తల్లిదండ్రుల తీరు మాత్రం మారడం లేదు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లో ఈరోజు ఉదయం ఓ అమానుష ఘటన వెలుగుచూసింది. అక్కడి రావి నారాయణరెడ్డి కాలనీలో మూడు నెలల ఆడశిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలివెళ్లారు. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకి ఈ సమాచారం అందించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.