: సరిహద్దులో రక్షణపై మనోహర్ పారికర్ అత్యవసర సమావేశం
యూరీ దాడికి ప్రతీకారంగా పీవోకేలో భారత్ జరిపిన దాడుల అనంతరం సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ రోజు సరిహద్దు ప్రాంతాల్లో మరోసారి ఉగ్రవాదులు చొరబడడంతో సరిహద్దులో భద్రతపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ న్యూఢిల్లీలో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మనోహర్ పారికర్‌తో భారత త్రివిధ దళాధిపతులు, మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) రణబీర్ సింగ్, ఎన్ఎస్ఏ అధికారులు పాల్గొన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితిపై ఎన్ఎస్ఏ వివరించనుంది.