: 'ఫేస్ బుక్ లో పసికందు విక్రయం'పై ఎన్ హెచ్ఆర్ సీ స్పందన


పంజాబ్ లోని లూథియానా పట్టణంలోని సత్యం ఆసుపత్రిలో జన్మించిన ఓ శిశువును ఫేస్ బుక్ ద్వారా విక్రయించిన ఘటనపై 'జాతీయ మానవ హక్కుల సంఘం' స్పందించింది. నాలుగు వారాల్లోగా 'ఉమెన్ చైల్డ్ డెవలప్ మెంట్' కార్యదర్శితోపాటు లూథియానా, ఢిల్లీ పోలీస్ కమిషనర్లు తమ నివేదికలు సమర్పించాలని ఓ ప్రకటనలో తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది.

విషయం ఏంటంటే, ఈనెల 3న పసివాడిని ఆ పిల్లాడి తాతే రూ. 40వేలకు ఆసుపత్రి నర్సుకు అమ్మాడు. ఆమె అదే ఆసుపత్రిలోని ల్యాబ్ అసిస్టెంట్ కు బాబును రూ. 3 లక్షలకు విక్రయించింది. ల్యాబ్ అసిస్టెంట్ అయితే బాబును ఏకంగా ఫేస్ బుక్ లో అమ్మాకానికి పెట్టాడు. ఫేస్ బుక్ లో ఆ సమాచారం చూసిన ఢిల్లీకి చెందిన వ్యాపారి రూ. 8 లక్షలు చెల్లించి రోజుల బాబును దక్కించుకున్నాడు. బిడ్డ దూరమవడంతో వెంటనే తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తక్షణమే స్పందించిన పోలీసులు చిన్నారిని అమ్మ ఒడికి చేర్చారు. ఆ పసికందు తాతతో పాటు, నర్సు, ల్యాబ్ అసిస్టెంట్ ను పోలీసులు అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News