: జయలలిత ఆరోగ్యంపై పెరుగుతున్న ఆందోళన.. నేడు పార్టీ నేతలతో శశికళ అత్యవసర సమావేశం!
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఆందోళన రోజురోజుకు మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి కోలుకుంటున్నారని, ఆమె ఇంకొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు పేర్కొన్నారు. మరోవైపు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అందరూ చెన్నై రావాలంటూ శశికళ ఆదేశించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి నేడు చెన్నైలో అత్యవసరంగా ఆమె సమావేశం కానున్నట్టు తెలుస్తోంది. అర్జెంటుగా రావాలంటూ సమాచారం అందుకున్న పార్టీ నేతలు జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.