: సరిహద్దులో పాక్ ఆక్రమిత కశ్మీర్ వ్యక్తి అరెస్ట్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలోకి ప్రవేశించిన వ్యక్తిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు మాట్లాడుతూ, పీవోకేలోని హవేలి జిల్లాకి చెందిన మోహద్ రషీద్ ఖాన్ అనే వ్యక్తి ఎల్ఓసీ వద్ద తిరుగుతుండగా అరెస్ట్ చేశామని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా, జమ్మూకశ్మీర్ లోని ఆక్నూర్ సెక్టార్ లో నిన్న పాక్ కాల్పుల నిబంధన ఉల్లంఘనకు మళ్లీ పాల్పడిన విషయం తెలిసిందే.