: ఒబామా బిగ్గరగా పిలిస్తే.. క్లింటన్ తాపీగా వెళ్లారు!


అమెరికా అధ్యక్షుడు ఒబామా, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ల మధ్య ఆసక్తికర సన్నివేశం ఒకటి ఇటీవల జరిగింది. ఇజ్రాయెల్ నేత సిమోన్ పారిన్ అంత్యక్రియల సందర్భంగా వీరిద్దరూ కలిసి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ కు వెళ్లారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరుగు పయనమయ్యే సందర్భంలో ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. అప్పటికే విమానంలోకి చేరుకున్న ఒబామా, క్లింటన్ కోసం ఎదురుచూస్తున్నారు. కొద్దిసేపు ఎదురు చూసినప్పటికీ క్లింటన్ రాలేదు. రన్ వే పై ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నారు. ఇంకొంచెంసేపు ఎదురు చూసినప్పటికీ క్లింటన్ రాలేదు. దీంతో, అసహనానికి గురైన ఒబామా డోర్ వద్దకు వచ్చి ‘బిల్.. వెళదాం పద’ అని అంటున్నా క్లింటన్ వినిపించుకోలేదు. దీంతో, మరోసారి అవే డైలాగ్ లను ఒబామా ఒకింత కోపంగా, గట్టిగా అనడంతో, అప్పటికి గానీ క్లింటన్ లైన్లోకి రాలేదు. విమానమెక్కిన క్లింటన్, ఒబామా కరచాలనం చేసుకుని లోపలికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News