: పుల్లెల గోపీచంద్ పై బయో పిక్.. ఆ పాత్రలో సుధీర్ బాబు!
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ పై త్రిభాషా చిత్రం తెరకెక్కనుంది. ‘చందమామ కథలు’ చిత్రం ద్వారా జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. కాగా, గోపీచంద్ పాత్రను ప్రముఖ నటుడు సుధీర్ బాబు పోషించనున్నట్లు తెలుస్తోంది. తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సుధీర్ బాబు నటుడు కాకముందు గోపీచంద్ వద్ద కొన్నాళ్ల పాటు బ్యాడ్మింటన్ లో శిక్షణ తీసుకున్నాడు. అందుకే, గోపీచంద్ పాత్రను సుధీర్ బాబు పోషిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.