: నా సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నాడేంటని రాజమౌళి ఆశ్చర్యపోయాడు: ప్రకాష్ రాజ్


‘బాహుబలి’ వంటి చిత్రం వచ్చినందుకు గర్వంగా ఉందంటూ దర్శకుడు రాజమౌళితో గతంలో గంటల కొద్దీ మాట్లాడానని ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ, ‘బాహుబలి సినిమా గురించి గంటలు తరబడి రాజమౌళితో నేను మాట్లాడాను. ఈయనేంటీ, నా సినిమా గురించి ఇంత మాట్లాడుతున్నాడని రాజమౌళి ఆశ్చర్యపోయాడు’ అని అన్నారు. ఈ చిత్రంలో నటించిన సత్యరాజ్ కు తాను బొకే కూడా పంపించానంటూ నాటి విషయాలను ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు. ఒక కథకు ఎలాంటి నటుడు కావాలో ఎంచుకునే హక్కు ప్రతి దర్శకుడికీ వుందని, తననే పెట్టుకోవాలని చెప్పడానికి తానెవర్ని అని ప్రశ్నించారు. మంచి పాత్రల్ని తాను మిస్సవడం లేదని, ఆ పాత్రలే తనను మిస్సవుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రకాష్ రాజ్ చెప్పారు.

  • Loading...

More Telugu News