: భారత్ ముందుగా ఏ దేశంపైనా దాడికి దిగలేదు: ప్రధాని మోదీ


పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం ఆకస్మిక దాడులు చేసిన నాలుగు రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశంపై స్పందించారు. భారత్ ఇప్పటి వరకు ఏ దేశంపైనా ముందుగా దాడులు చేయలేదని, ఆక్రమణలకు దిగలేదని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ప్రవాసీ భారతీయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. నేరుగా పాకిస్తాన్ ను ప్రస్తావించకుండా ఆ దేశానికి అర్థమయ్యేలా మాట్లాడారు. ‘భారత్ ఇంతవరకూ పరాయి దేశంలోని భూభాగాన్ని ఆక్రమించలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో వేలాది మంది భారతీయులు ప్రాణత్యాగం చేసినాగానీ ఏ దేశంపైనా దాడికి దిగలేదు’ అని అన్నారు. గత రెండేళ్ల కాలంలో ఘర్షణాత్మక పరిస్థితుల నుంచి దేశీయులనే కాకుండా విదేశీయులనూ రక్షించిన విషయాన్ని గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News