: గాంధీకి గవర్నర్, సీఎం కేసీఆర్ నివాళులు


మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులు నివాళులు అర్పించారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. గాంధీకి నివాళులు అర్పించిన ఇతర ప్రముఖుల్లో స్పీకర్ మధుసూదనాచారి, ఏపీ శాసన మండలి చైర్మన్ చక్రపాణి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి తదితరులు ఉన్నారు.

  • Loading...

More Telugu News