: దసరా వేడుకలే లక్ష్యంగా భారీ విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర.. హెచ్చరించిన నిఘా వర్గాలు


భారత్ చేసిన మెరుపు దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాకిస్థాన్ భారత్‌పై ప్రతీకార దాడులకు సిద్ధమవుతున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. పాక్ ప్రభుత్వం, సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ), ఉగ్రవాదుల కదలికలను గమనించిన నిఘా వర్గాలు ఇందుకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర హోంశాఖకు అందించాయి. దీని ప్రకారం.. ఆత్మరక్షణ, ప్రతీకార దాడి, స్వదేశంలో ప్రతిష్ఠను మళ్లీ పెంచుకోవడంపై పాక్ ప్రధానంగా దృష్టి సారించింది. భారత్ సర్జికల్ దాడులకు ‘బ్లాక్ బస్టర్’ దాడులతో సమాధానం చెప్పాలని పాకిస్థాన్ వ్యూహ రచన చేస్తోంది. దసరా వేడుకల్లో వీటిని అమలు చేయాలని యోచిస్తోంది. దసరా సమయంలో ఈ ప్రణాళికను అమలు చేయడం ద్వారా భారీ ప్రాణ నష్టం కలిగించాలనేది ఐఎస్ఐ యోచన. నిఘా వర్గాల నివేదికను అందుకున్న కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా కోస్టుగార్డు దళాలను అప్రమత్తం చేసింది.

  • Loading...

More Telugu News